తూర్పు
మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ భారత తీరం వైపున కదులుతూ
రాగాల 24 గంటల్లో పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ
వెల్లడించింది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల ఉరుములు,
మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
అటు తెలంగాణాలో ఆదివారం, సోమవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ
శాఖ చెబుతోంది. ఇకపోతే హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా మోస్తరు
వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కోస్తాంధ్రాలో పలు చోట్ల భారీ
వర్షాలు కురుస్తుండటంతో పంట పొలాలు అన్నీ నీటిపాలయ్యాయి.
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment