Skip to main content

రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

Anil Sunkara gives assurance to Mahesh Babu fans, రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

మహేష్ ఫ్యాన్స్‌కు నిర్మాత భరోసా ఇచ్చేశాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఆయన ఊరించాడు. ఇక ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అసలు ఆ నిర్మాత ఏం చెప్పాడు..? మహేష్ ఫ్యాన్స్‌కు ఏ ట్రీట్ ఇవ్వబోతున్నాడు..? అనుకుంటున్నారా..?
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం పై వస్తోన్న వార్తలు మహేష్ అభిమానులను కాస్త కలవరపాటుకు గురిచేశాయి. ఈ సినిమా పాటల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు మనస్ఫర్థలు వచ్చాయని.. ఈ మూవీ ఆల్బమ్‌పై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురం’లో చిత్రం కూడా మహేష్ మూవీతో పోటీ పడనుండగా.. ఇప్పటికే వారు ప్రమోషన్లలో దూసుకుపోతూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇలాంటి సమయంలో సరిలేరు నీకెవ్వరు టీమ్ సైలెంట్‌గా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు లోనయ్యారు. ఇక వారందరినీ కూల్‌ చేయడం కోసం ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర రంగంలోకి దిగారు.
‘‘సరిలేరు నీకెవ్వరు కోసం దేవీ శ్రీ ప్రసాద్ చేసిన మాస్ సాంగ్‌ను విన్నాను. ఆ పాటకు కేక అనేది చిన్న పదం అవుతుంది. దేవీ తన ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాడు. మహేష్ అభిమానులకు, ప్రేక్షకులకు ఈ పాట మాస్ ట్రీట్‌ను ఇవ్వబోతోంది. రాక్‌స్టార్, అనిల్ రావిపూడికి చాలా థ్యాంక్స్. అభిమానులకు ఈ ఆల్బమ్ కచ్చితంగా నచ్చుతుంది’’ అని అనిల్ సుంకర ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా సినిమా ప్రారంభోత్సవంలో దేవీ మాట్లాడిన వీడియోను.. అతడితో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు.
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Embedded video

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.