Skip to main content

త్వరలో మూడో ప్రపంచ యుద్ధం.. కే ఏ పాల్ వీడియో.. ఆర్జీవీ ట్వీట్..

త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. 


త్వరలో మూడో ప్రపంచ యుద్ధం.. కే ఏ పాల్ వీడియో.. ఆర్జీవీ ట్వీట్..– News18 Telugu


త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే ఏడుగురు దేశాధినేతలను కలిశానని వెల్లడించారు. అందుకే తాను పలు కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నానని, అందుకు క్షమించాలని అన్నారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేఖ కూడా రాయబోతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి, దండాలు అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా, ఆర్జీవీ కేఏ పాల్‌పై పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కామెడీగా చూపించారు. నా టార్గెడ్ మోడీ అంటూ.. తన ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలోని అందరూ ప్రధానులు అటెండ్ అవుతారని.. పాకిస్థాన్ యుద్దాన్ని తాను ఆపానని.. ఇలా పాటలో కేఏ పాల్ కొన్ని వ్యాఖ్యలి జోడిస్తూ.. చాలా సెటైరికల్‌గా రూపొందించారు. 

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here