Skip to main content

నటుడు విజయ్ సేతుపతిపై వ్యాపారుల ఆగ్రహం.. ఇంటి ముట్టడికి రెడీ!



 



ఓ వ్యాపార సంస్థ రూపొందించిన మండి యాప్‌లో నటించిన తమిళ నటుడు విజయ్ సేతుపతిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ నటించిన ఆ యాప్ చిరు వ్యాపారుల పొట్ట కొట్టేలా ఉందని మండిపడుతున్నారు. అందులో నటించిన విజయ్ సేతుపతి కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువులు ఆ యాప్‌లో దొరకుతాయని, ఆన్‌లైన్‌లో ఇంటి వద్ద నుంచే కొనుగోలు చేసుకోవచ్చని ప్రచారం చేశాడు.

తమ పొట్టకొట్టేలా ఉన్న ఈ యాప్‌లో విజయ్ సేతుపతి నటించడంపై మండిపడుతున్న వ్యాపారులు అతడి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని చిరు వ్యాపార సంఘాల నాయకుడు ఒకరు తెలిపారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఇలాంటి వాటిని తాము అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

Comments