Skip to main content

కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం

.

CMs urge Centre to convene urgent meeting on Delhi Pollution, కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం..!

ఢిల్లీలో వాయు కాలుష్యం అతి పెద్ద సమస్యగా మారింది. దీపావళి పండుగ అనంతరం ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో జనం ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. అలాగే.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. యూపీ, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.
కాగా.. ప్రస్తుతం ఈ లేఖలపై పెద్ద దుమారమే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకే ఉమ్మడిగా కృషి చేయాలని ఢిల్లీ పరిసర రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా.. హర్యాణా, పంజాబ్‌ రాష్ట్రాల కారణంగా.. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని.. ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు.. విద్యార్థులచే లేఖలు రాయించారు సీఎం కేజ్రీవాల్. దీనికి స్పందించిన కేంద్రమంత్రి జవదేకర్.. ఈ విషయాన్ని కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఢిల్లీ రాజధాని.. అతి ముఖ్యమైన సమస్య.. కాలుష్యమని.. దీనిపై కేంద్రమంత్రి సరిగా.. స్పందిచకపోగా.. రాజకీయాలు చేయొద్దని.. వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని.. ఢిల్లీలో.. గాలి నాణ్యత క్షీణిస్తున్నప్పటికీ కేంద్రమంత్రి పట్టించుకోడం లేదని విమర్శించారు.

Comments