Skip to main content

అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..! మంత్రులకు యూపీ సీఎం యోగి వార్నింగ్‌


‘అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..!
కొన్ని రోజుల్లో అయోధ్య కేసు తుది తీర్పువెలువడనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరాదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ తన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తీర్పు వచ్చే వరకు నోర్లకు పనిచెప్పకండని కాస్తగట్టిగానే హెచ్చరించారని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు.
‘అధికార ప్రభుత్వానికి అనూకూలంగా సుప్రీం తీర్పు వస్తుందని అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకండని మా ముఖ్యమంత్రి యోగిజీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంత్రులందరూ వ్యక్తిగతంగా దిక్కత్‌ జారీ చేశారు. ఈ విషయంలో భాజపా అధిష్ఠానం కూడా హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా..అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలు చేసుకోకూడదనే నిబంధన విధించారు. హిందూ, ముస్లిం వర్గాలకు ప్రభుత్వం తరఫున మా విన్నపం ఇదే. వేడుకలు చేసుకొని మరొకరి మనోభావాలు దెబ్బతీయకండి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ దీనిపై సమావేశాలు కూడా నిర్వహించింది. భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించింది. 

Comments