నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో మోక్షజ్ఞ, అదిగో మోక్షజ్ఞ అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తూనే ఉన్నారు. బాలయ్య నూరో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకో సినిమా కోసం కూడా అదే ప్రచారం కంటిన్యూ అయ్యింది. బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం షురూ కావడం లేదు. అసలింతకీ మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? లేదా? అనే ఆలోచనకి అభిమానులు వచ్చేశారు.
అసలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదనీ, కావాలని బలవంతం చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. మరి ఈ గుసగుసలకు చెక్ పెట్టాలన్నీ, రూమర్స్‌కి సడెన్ బ్రేక్ ఇవ్వాలన్నా ఒక్కటే మార్గం, మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కావడమే. కానీ ఎప్పుడు.? అందుకు సమయమొచ్చిందంటున్నారిప్పుడు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్.రామారావు దర్శకత్వంలో 'రూలర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో ఓ సినిమాలో నటించనున్నాడు.
ఆ సినిమాతో పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం. ఇదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శీను ఈ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నాడట. 'వీవీఆర్' తర్వాత బోయపాటి నుండి రానున్న సినిమా ఇది. రేపో మాపో సెట్స్ మీదికి వెళ్లనుంది. చూడాలి మరి, ఈ సారైనా నందమూరి వారసుడి ఎంట్రీ ఉంటుందో.? లేక ఎప్పటిలానే ఊరించి ఉసూరుమనిపిస్తారో.!
Comments
Post a Comment