మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే.. రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఫైనల్ రేసులో రన్నరప్‌గా అవుతాడని అనుకున్న రాహుల్ టైటిల్ సొంతం చేసుకోగా.. శ్రీముఖి రెండు పర్సెంట్ ఓట్లు తేడాతో రన్నరప్‌గా నిలిచినట్లు సమాచారం.
ఇక వరుణ్ సందేశ్ మూడో స్థానంలో.. బాబా భాస్కర్ నాలుగో స్థానంలో.. అలీ రెజా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ట్రోఫీ, రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందుకోనున్నాడు.
మరోవైపు ఫినాలే ఎపిసోడ్‌కు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్, అంజలి, క్యాథరిన్‌ల హై వోల్టేజ్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఉండగా.. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment