చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనలో భాగంగా ఇక్కడి స్థానిక వంటకాలను
ఆయన రుచి చూడనున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో లభించే స్థానిక రుచులను
ఆయనకు వడ్డించనున్నారు. రాత్రి భోజనంలో భాగంగా టమోటా చారు, అరచువిట్టా
సాంబార్, కడలాయ్ కుర్మా, కవణరాశి హల్వాతో పాటు మరికొన్ని భారతీయ వంటలను
వడ్డిస్తారు. ఇప్పటికే జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి
నేరుగా స్థానిక ఐటీసీ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. అక్కడి నుంచి బయల్దేరి
మహాబలిపురం చేరుకుంటారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం
పలుకుతారు.

Comments
Post a Comment