Skip to main content

దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర


దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర
 కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ చేపట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. మచిలీపట్నంలోని ఇంటిదగ్గర కొల్లు రవీంద్ర దీక్షను కొనసాగిస్తున్నారు. ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష పట్టాలని నిర్ణయం తీసుకుంటే.. పోలీసులు తమను రాత్రి నుంచి వేధిస్తూ దీక్షను అడ్డుకుంటున్నారని కొల్లు ఆరోపించారు. రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా సామాన్యులకు ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. వైకాపా నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఈ విషయం తమ నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు. 36 గంటల దీక్షతో ఆపేది లేదని, సామాన్యులకు ఇసుక చేరేవరకూ దఫదఫాలుగా తమ నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...