Skip to main content

నాటి పల్లవరాజు కుమారభిక్షువే... చైనీయుల ఆరాధ్యుడు బోధి ధర్ముడు... అందుకే మహాబలిపురాన్ని కోరిన జిన్ పింగ్!

తమిళనాడు సముద్ర తీర పట్టణమైన మహాబలిపురం... ఇండియాలో ఎన్నో నగరాలు, మరెన్నో చారిత్రక ప్రాంతాలూ ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఈ ప్రాచీన నగరాన్ని ఇండియాలో పర్యటనకు ముఖ్య కేంద్రంగా ఎంచుకున్నారు. ఇదే పట్టణాన్ని సందర్శించాలని, ఇక్కడే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని జిన్ పింగ్ భావించడం వెనుక పెద్ద కారణమే ఉంది.

దాదాపు 1200 సంవత్సరాల క్రితం... అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని ఓ మహా నగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో ఆయన బోధి ధర్ముడు. చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు.

ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.