టీవీ9 నిధులను అక్రమంగా డ్రా చేసుకున్నారనే ఆరోపణల కేసులో ఆ చానల్ మాజీ
సీఈవో చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను
విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్
పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన
కోర్టు... తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలను విన్న
తర్వాత తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment