Skip to main content

ఉగ్రవాదులకు లొంగిపోదామా?’ ప్రజల్ని ప్రశ్నిస్తూ కశ్మీర్‌ ప్రభుత్వ ప్రకటన


‘ఉగ్రవాదులకు లొంగిపోదామా?’
జమ్మూకశ్మీర్‌లో ప్రజలు తమకు తాము విధించుకున్న స్వీయ నిర్బంధం నుంచి బయటికి రావాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం దాదాపు అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటన ఇచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు బయటికి రాకపోవడాన్ని ప్రభుత్వం అభివృద్ధి నిరోధక చర్యగా అభివర్ణించింది. అధికరణ 370రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని దశలవారీగా ఎత్తివేస్తూ వచ్చింది. కానీ, ఉగ్రవాదులు మాత్రం ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని.. పూర్తి స్థాయి బంద్‌ పాటించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు స్వీయ నిర్బంధం విధించుకొని ఇళ్లలోనే ఉండటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కశ్మీర్‌లో ఇంకా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం ప్రజలు బయటికి రావాలని కోరుతూ ప్రకటన ప్రచురించింది. 
ఉగ్రవాదులకు లొంగిపోదామా? అంటూ ప్రకటనలో ప్రభుత్వం ప్రజల్ని ప్రశ్నించింది. 70 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని.. విష ప్రచారంలో మగ్గిపోయారని పేర్కొంది. ఓవైపు వేర్పాటువాద నేతల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుంటే ఇక్కడి వారు మాత్రం ఉగ్రవాదం, హింస, పేదరికంతో అనేక బాధలు అనుభవించారన్నారు. అమాయక యువకుల్ని రెచ్చగొట్టి ఉగ్రవాదంలోకి లాగుతున్నారని వివరించారు. ఇప్పటికీ అదే వైఖరిని అనుసరిస్తూ.. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ఇంకా అదే బెదిరింపులకు లొంగిపోదామా? మన వ్యాపారుల్ని స్తంభింపజేసుకుందామా?మన జీవనాధారాన్ని నిలిపేసుకుందామా? మన పిల్లల విద్య తద్వారా వారి భవిష్యత్తును అడ్డుకుందామా?’ అని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. ‘ఇది మన దేశం, దీని సంక్షేమం మన బాధ్యత. భయమెందుకు’ అని చివరగా ప్రజలకు అభయమిచ్చారు.

Comments

Popular posts from this blog

ఆసుపత్రిలో చేరిన శివసేన నేత సంజయ్ రౌత్

  శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

నా 50ఏళ్ల రాజకీయంలో ఇలాంటివెన్నో చూశా!

శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీల కూటమే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కరాడ్‌లో మీడియాతో మాట్లాడారు. భాజపాతో చేతులు కలిపింది తన సోదరుడి కుమారుడు అజిత్‌ పవారే తప్ప ఎన్సీపీ కాదని పునరుద్ఘాటించారు. ఇది ఎంతమాత్రం  తమ పార్టీ నిర్ణయం కాదనీ..  ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని తాము అంగీకరించబోమని పవార్‌ స్పష్టంచేశారు. ఎన్సీపీ- కాంగ్రెస్‌- శివసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తమ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌తో తాను టచ్‌లో లేనన్నారు. అజిత్‌ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించే అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం అనూహ్యంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్ర...