అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో నాలుగోస్థానానికి ఎగబాకాడు. కేవలం 81 టెస్టుల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలోను, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారా (131 టెస్టులు) మూడో స్థానంలోను ఉన్నారు.
ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించాడు. ఏడు వేల పరుగుల మైలురాయిని ఓ డబుల్ సెంచరీతో సాకారం చేసుకున్న తొలి బ్యాట్స్ మన్ కోహ్లీనే!
Comments
Post a Comment