Skip to main content

పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్‌

 
పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్‌
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ , ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురం పర్యటన కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం మహాబలిపురం చేరుకున్న ఇరుదేశాధినేతలు పలుచారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలను ధరించారు. మహాబలిపురంలోని పలు చారిత్రక కట్టడాలను వీక్షిస్తూ  ఇరువురు నేతలు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.  చారిత్రక కట్టడాల విశిష్టత, శిల్ప కళా సౌందర్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే శిల్పాన్ని , కృష్ణుడి వెన్నముద్ద శిలను, ఏకశిలాకట్టడాలైన పంచరథాలు, ఇతర విగ్రహాలను ఇరువురు నేతలు సందర్శించారు. వెయ్యేళ్ల క్రితం వీటిని నిర్మించిన పల్లవరాజుల  గొప్పదనాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరి బోండాలు సేవిస్తూ పలు అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారు.అనంతరం మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాప్రదర్శనలను మోదీ, జిన్‌పింగ్‌ వీక్షించారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. జిన్‌పింగ్‌ గౌరవార్థం రాత్రికి మోదీ విందు ఇవ్వనున్నారు. శనివారం జిన్‌పింగ్‌, మోదీ ఇష్టా గోష్ఠి చర్చలు జరపనున్నారు.
పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్‌
అంతకుముందు బీజింగ్‌ నుంచి ప్రత్యేక విమానంలో  చెన్నై చేరుకున్న షీ జిన్‌పింగ్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అభివాదం చేస్తూ విమానం నుంచి దిగిన చైనా అధ్యక్షుడికి తమిళనాడు గవర్నర్‌  భన్వరీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి,  కేంద్ర ప్రభుత్వ అధికారులు స్వాగతంపలికారు. వారందరితో జిన్‌పింగ్‌ కరచాలనం చేశారు. తమిళ సంప్రదాయం ప్రకారం జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను  జిన్‌పింగ్‌ ఆసక్తిగా తిలకించారు. అనంతరం గిండిలోని హోటల్‌కు జిన్‌పింగ్‌ వెళ్లారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం మహాబలిపురం విచ్చేశారు.
పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్‌
పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్‌

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...