సైరా సినిమాతో ఘన విజయం సాధించిన మెగా ఫ్యామిలీ సినిమా చూడటానికి ap సీఎం జగన్ ని ఆహ్వానించటానికి శుక్రవారానికి అపాయింట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ భేటీలో చిన్న మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖరారైన భేటీ 14కి మారినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ చిరంజీవిని, రామ్ చరణ్ ని లంచ్ కి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ భేటీ సినిమా వరకే పరిమితం అవుతుందా, లేక రాజకీయ చర్చకి తెరతీస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాగా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తుండగా ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది
Comments
Post a Comment