Skip to main content

వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న జియో

ఐయూసీ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని జియో తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైన నేపథ్యంలో, సదరు సంస్థ నుంచి వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. అక్టోబరు 9న, అంతకుముందు రీచార్జి చేసుకున్నవాళ్లు తమ ప్లాన్ గడువు ముగిసేవరకు ఇతర నెట్ వర్క్ లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నిమిషానికి 6 పైసల చార్జి తప్పదు. దీనికోసం ప్రత్యేకంగా టాప్ అప్ కూపన్లు మార్కెట్లోకి రానున్నాయి.

ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయంతో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే, ట్రాయ్ ఐయూసీ చార్జీల నిబంధన తీసుకురావడంతో జియో తన ప్రణాళికను సమీక్షించుకోవాల్సి వచ్చింది. ఒక నెట్ వర్క్ కు చెందిన యూజర్లు మరో నెట్ వర్క్ కు కాల్ చేస్తే... కాల్ అందుకున్న నెట్ వర్క్ కు కాల్ చేసిన నెట్ వర్క్ కొంత చార్జీ చెల్లించడమే ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి).

ఇప్పటివరకు జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసుకునే కాల్స్ కు అయ్యే ఖర్చును జియోనే భరించింది. గత మూడేళ్లలో తన నెట్వర్క్ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ఇతర నెట్వర్క్ లకు వెళ్లే వాయిస్ కాల్స్ పై రూ.13,500 మేర ఐయూసీ చార్జీలు పడగా, ఆ భారం మొత్త జియోనే భరించింది. అయితే, ఇకమీదట ఆ భారం తగ్గించుకోవాలని భావించిన జియో తన యూజర్లు చేసే వాయిస్ కాల్స్ పై నిమిషానికి రూ.6 పైసలు వంతున వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...