Skip to main content

Posts

చుట్టూ వరద.. బయటకు వెళ్లలేని పరిస్థితి. చెట్టుకొమ్మ ఒక్కటే దిక్కైంది

ఎడతెరిపి లేకుండా వానలు , చుట్టూ వరద నీరు … ఆసరా గా ఒక చెట్టుకొమ్మ.. వివరాలు లో కి వెళ్ళితే ఈ ఘటన చండీఘడ్ లో బిలాస్ పూర్ లో జరిగింది. ఇక్కడ ఉన్న ఖూటఘాట్ డ్యామ్ కు ఆదివారం సాయంత్రం జితేందర్ కశ్యప్ అనే వ్యక్తి స్నానానికి వచ్చాడు, అయ్యితే అదే సమయానికి డ్యామ్ నుంచి నుంచి వరద నీరు ప్రవాహం పెరగడం తో అయన అక్కడ నుంచి బయటకి రాలేకపోయారు , అక్కడే ఉన్న బండరాళ్లను , చెట్టుకొమ్మని ఆధారం గా పట్టుకొని 16 గంటల సేపు తన ప్రాణాలను కాపాడుకున్నాడు విషయం తెలుసుకోన్న ఐఏఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ తో వచ్చి.సోమవారం తెల్లవారు జామున. కిందికి తాడును వదిలి జితేందర్ కశ్యప్ ను రక్షించింది

ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు

 ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. యూనివర్శిటీలు, కాలేజీలు, పాఠశాలలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖలోని తిరుమలగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. వాస్తవానికి ఆగస్ట్ 15వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, పట్టాల కేటాయింపుల్లో పలు అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.  

ప్రభాస్‌.. రాముడిగా కనిపించనున్నారా?

  అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 3డీ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. మంగళవారం ఉదయం టైటిల్‌తో పాటు, కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో ఈ సినిమాపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పోస్టర్‌లో రామాయణ పాత్రలు కనిపించడంతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ దీనిపైనే చర్చ మొదలైంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడా? లేదా? ఆ పాత్ర లక్షణాలతో ప్రభాస్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌తో ప్రభాస్‌ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది. ‘‘ప్రభాస్‌గారిని రాముడిగా చూసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఆ పాత్రను వెండితెరపై చాలా కొద్దిమంది నటులు మాత్రమే పోషించారు. చిత్ర బృందానిఇక శుభాకాంక్షలు’’ అని నాగ్‌ అశ్విన్ ట్వీట్‌ చేయడంతో ‘ఆది పురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడని అర్థమవుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించ లేదు. దీనిపై దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ..‘‘నా విజన్‌ను గుర్తించి సినిమాలో భాగస్వామి అయింనందుకు ప్రభాస్‌కు...

ప్లాస్మా దానానికి భయపడొద్దు: రాజమౌళి

 ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. పౌష్ఠికాహారం తీసుకుంటూ.. వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చన్నారు.  కీరవాణి మాట్లాడుతూ.. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవినితో సమానమన్నారు. తమ కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.  సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ...కరోనా బాధితులపై వివక్ష చూపొద్దని, వారే రేపటి ప్రాణదాతలని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలని కోరారు. ప్...

నాన్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు:ఎస్పీ చరణ్‌

 ప్రముఖ గాయకుడు, తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెంటిలేటర్‌ తొలగించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. సోమవారం ఏవిధంగానైతే ఉందో నేడూ అలాగే ఉంది. నాన్నగారికి వెంటిలేటర్‌ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆ రోజు రావాలని మేమూ ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. ఇలాగే మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌లోనూ టిక్‌టాక్‌ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్!

 సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కొత్తగా 'షార్ట్‌ వీడియో' అనే ఫీచర్‌ను‌ తీసుకురానుంది. షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించడంతో పాటు అమెరికాలోనూ నిషేధం విధించే అవకాశాలు ఉండడంతో ఫేస్‌బుక్‌ కూడా ఆ తరహా షార్ట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.  న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ ఫీచర్ ఉంటుంది. ఇందులో చిన్న వీడియోలను యూజర్లు రూపొందించుకోవచ్చు. ఇందులో మనం పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్‌ వచ్చాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ అనే ఓ ఆప్షన్ తీసుకువచ్చి షార్ట్ వీడియోలను పోస్ట్ చేసుకునేలా సౌలభ్యం కలిగించిన విషయం తెలిసిందే. షార్ట్ వీడియోలకు అత్యధిక ఆదరణ వస్తుండడంతో యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, షార్ట్ వీడియో యాప్‌లను తీసుకురావడానికి ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. షార్ట్ వీడియోలు యూజర్ల సమయాన్...

అన్నయ్యకు వెంటిలేటర్ తొలగించారు.. క్రమంగా కోలుకుంటున్నారు: బాలు సోదరి ఎస్పీ శైలజ

 కరోనాతో తీవ్రపోరాటం సాగిస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. తన అన్నయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వెల్లడించారు. మునుపటితో పోల్చితే ఎంతో కోలుకున్నారని తెలిపారు. ఇవాళ  వైద్యులు ఆయనకు వెంటిలేటర్ తొలగించారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నారని వివరించారు. తన సోదరుడు చికిత్సకు స్పందిస్తున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తన సోదరుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనా చికిత్స కోసం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్నిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఏపీలో 'ఫోన్‌ ట్యాపింగ్' కలకలంపై‌ హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషనర్

 ఆంధ్రప్రదేశ్‌లో 'ఫోన్ ట్యాపింగ్‌' ఆరోపణలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఏపీ‌ హైకోర్టులోని కొందరు జడ్జీల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని విశాఖపట్నం జిల్లాకు చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందుకోసం సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది. అలాగే, ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదో చెప్పాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.  

పెను ప్రమాదం నుంచి బయటపడిన ట్రంప్

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎగురుకుంటూ వచ్చిన ఓ డ్రోన్ ఒకటి విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది.

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ 'ఆదిపురుష్'!

 ప్రభాస్ నటించే హిందీ చిత్రం టైటిల్ ఎనౌన్స్ అయింది.  ఈ ఉదయం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రభాస్ తన సినిమాకు 'ఆదిపురుష్' (సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఆన్ ఈవిల్) అని టైటిల్ పెట్టినట్టు ఆయన తెలిపారు. టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ లోగో విడుదల కాగానే వైరల్ అయిపోయింది.  'ఎ' అనే అక్షరంలో వీర హనుమాన్ చిత్రం, కొందరు రాక్షసుల చిత్రాలు ఎంబోజ్ అయి ఉన్నాయి. కొన్ని పురాతన ఆలయాల చిత్రాలు, విల్లెక్కు పెట్టిన యోధుడి నీడ కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిని త్రీడీ ఫార్మాట్ లో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రాన్ని ఆ ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు. ఇది పౌరాణిక చిత్రంగా, మహా విష్ణువు తొలి అవతారం ఆధారంగా రూపొందుతుందని సమాచా

నిత్యానందుడి కైలాస విలాసం |

 కైలాస పురుష పుంగ‌వుడు నిత్యానంద మామూలోడు కాదు. ఆయ‌న గారి లీల‌లు చూడ‌త‌రం కావ‌డం లేదు. ఆధ్యాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందిన నిత్యానంద గుట్టు ర‌ట్టు అయ్యే స‌రికి దేశం విడిచాడు. ఆ త‌ర్వాత కైలాస వాసిగా స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు నిత్యానంద లేటెస్ట్ అప్‌డేట్‌కు వ‌స్తే...దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్త నుంచి ఆర్థిక‌వేత్త‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నారు. త‌న దేశంలో కైలాస రిజ‌ర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆయ‌న తాజా ప్ర‌క‌ట‌న సారాంశం. ఇప్ప‌టికే త‌న దేశానికి పాస్‌పోర్ట్‌, ప్ర‌త్యేక జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసిన విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు, ప్ర‌త్యేక కేబినెట్ ఏర్పాటుతో స్వ‌యం పాల‌న సాగిస్తున్న‌ట్టు నిత్యానంద ప్ర‌క‌టించి ఔరా అనిపించారు. ప్ర‌స్తుతానికి వ‌స్తే రిజ‌ర్వ్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు ప్ర‌త్యేక క‌రెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ క‌రెన్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా చెల్లుబాటు ...

ప్రభాస్ రేపు ఏం చెబుతాడో.... అభిమానుల్లో ఆసక్తి!

 సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓవైపున ప్రభాస్ ఉండగా, మరోవైపున ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆడియో కంపెనీ టీ సిరీస్ ప్రతినిధి ఉండడం చూడొచ్చు. టీ సిరీస్ ప్రతినిధి మాట్లాడుతూ, "హాయ్ ప్రభాస్, రేపటికి మీరు రెడీగా ఉన్నారా?" అని ప్రశ్నించగా, "చాలా ఎక్సైటింగ్ గా ఉంది, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను" అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. "లెట్స్ డూ ఇట్" అంటూ టీ సిరీస్ ప్రతినిధి ఉత్సాహంగా పిడికిలి బిగించాడు. ప్రభాస్ కూడా చిరునవ్వుతో పిడికిలి బిగించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ప్రభాస్... టీ సిరీస్ నిర్మాణంలో ఓ బాలీవుడ్ సినిమా చేయనున్నట్టు అర్థమవుతోంది. కరణ్ జొహార్ తో కానీ, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో కానీ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశాన్ని టీ సిరీస్ నిర్మాణ సంస్థ చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. రేపు ప్రభాస్ చెప్పే మ్యాటర్ తో దీనిపై మరింత క్లారిటీ రానుంది.

48 గంటల్లో మోడల్ హౌస్‌.. ఏపీలో తొలిసారి

 ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రయోగాత్మక మోడల్ హౌస్‌ నిర్మితమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అత్యుత్తమ టెక్నాలజీతో మోడల్‌ హౌస్‌ను నిర్మించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్‌తో ఈ మోడల్‌ హౌస్‌ని 48 గంటల్లో పూర్తి చేశారు. ఈ హౌస్‌ని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్‌ రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర హౌసింగ్‌ చరిత్రలో తొలిసారి ఒక మోడల్‌ హౌస్‌ నిర్మాణం జరిగిందని అన్నారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం కలుగుతుందని భరత్ వివరించారు. ఈ మోడల్ హౌస్ నిర్మాణానికి మూడున్నర లక్షల లోపు ఖర్చు అవుతుందని ఎంపీ తెలిపారు.

వీడియో రికార్డింగ్‌ కానున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రయోగాత్మక‌ ప్రాజెక్టుగా 20 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్‌ ప్రక్రియను చేపట్టనుంది. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. రాష్ట్రస్థాయిలోని కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

హోమ్‌లోన్‌పై అదిరిపోయే ఆఫర్, మార్కెట్లో అతి తక్కువ: ఎవరికి... ఎంత వడ్డీ?

 కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనుగోళ్లు, తదనుగుణంగా ధరలు తగ్గిపోయాయి. ఈ సమయంలో చేతిలో డబ్బులు ఉన్నవాళ్లు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. 1.వడ్డీ రేటు ఎంత.. ఎవరికి వర్తిస్తుంది? దేశంలో అతిపెద్ద మార్టగేజ్ రుణాలు అందించే LICHFL వడ్డీరేటును గతంలో ఎన్నడు లేని విధంగా 6.90 శాతానికి తగ్గిస్తున్నట్లు బుధవారం తెలిపింది. అయితే సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్నవారు కొత్తగా రూ.50 లక్షల లోపు ఇంటి రుణం తీసుకున్న వారికి మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. రూ.50 లక్షలపై రుణం తీసుకున్నవారికి మాత్రం 7శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. హోమ్ లోన్స్ పైన వడ్డీరేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గించడంతో నెలవారి చెల్లింపులు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో హోమ్ లోన్స్ ఊపందుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మొహంతి తెలిపారు. 2....

మీ పాలసీ ల్యాప్స్ అయిందా? LIC గుడ్‌న్యూస్, రాయితీతో పునరుద్ధరణ నేటి నుండే

ఏదైనాకారణంతో మీ ఇన్సురెన్స్ పాలసీ రద్దయిందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఏ కారణంతో అయినా ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రకటించింది. ఈ రోజు (ఆగస్ట్ 10, సోమవారం) నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 1ఈ పాలసీలు మినహా... లేట్ ఫీజుపై రాయితీ టర్మ్ పాలసీలు, ఇతర అధఇక నష్టభయం పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో పునరుద్ధరించుకోవచ్చునని ఎల్ఐసీ తెలిపింది. ఆలస్య రుసుంపై 20 శాతం మినహాయింపు ఉందని, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 25 శాతం రాయితీ కూడా ఉంటుందని మరో అదనపు ఊరట కల్పించింది. ఈ పాలసీల పునరుద్దరణ కోసం ఎల్ఐసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది. 2అయిదేళ్లలోపు ఉంటే పునరుద్ధరణ ఏ పథకానికి కూడా వైద్యపరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే లేట్ ఫీజు మాత్రం చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించలేని తేదీ నుండి అయిదేళ్లలోపు అయితే పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించి...

ఉత్తర కొరియాలో తీవ్ర ఆహారకొరత... పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ కిమ్ ఆదేశాలు

  ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన మార్కు నిర్ణయం ఎలావుంటుందో చాటిచెప్పారు. దేశంలో ఆహార కొరత తీవ్రమైన నేపథ్యంలో, ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రజలకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. జూలైలో ఆయన కొత్త విధానం ప్రకటించారు. ఎవరైనా గానీ పెంపుడు కుక్కను కలిగివుండడం జాతీయ చట్టానికి వ్యతిరేకం అని హుకుం జారీ చేశారు. అంతేకాదు, పెంపుడు కుక్కను కలిగివుండడం కళంకిత బూర్జువా విధానానికి ప్రతీక అని కిమ్ సూత్రీకరించారు. కిమ్ ఆదేశాలు ఇచ్చిందే తరువాయి, అధికారులు పెంపుడు కుక్కలు ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ శునకాలను ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. కొరియాలో కుక్కమాంసం తినడం ఎప్పట్నించో ఉంది. అయితే, కుక్కమాంసం తినే అలవాటు దక్షిణ కొరియాలో క్రమంగా తగ్గిపోతుండగా, కిమ్ మాత్రం ఆహార కొరత నేపథ్యంలో పెంపుడు కుక్కలపై పడ్డారని అతడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.  

పవన్ సినిమా కోసం దర్శకుల మధ్య పోటీ!

  పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు. పవన్ ని కొత్త కోణంలో చూపించాలన్న తాపత్రయంతో కథలు తయారుచేసుకుంటూ వుంటారు. ఇప్పుడు కూడా అలాగే ముగ్గురు దర్శకులు ఆయన సినిమా ఛాన్స్ కోసం కథలు తయారుచేస్తున్నారు. ఆమధ్య ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన పవన్.. ఇటీవల కాస్త విరామం తీసుకుని మళ్లీ సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముందుగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందుతోంది. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఆ తదుపరి ఆయన నటించే 29వ సినిమా కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఆయనకు ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణ పనుల్లో వున్నారాయన. అయితే, దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, డాలీ, గోపీచంద్ మలినేని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ ని మెప్పించే కథ ఎవరు తెస్తే వారికే ఛాన్స్ ఇవ్వాలని నిర్మాత నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకుల...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  

విజయవాడలో దారుణం... కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి దహనం

  విజయవాడలో దారుణ ఘటన జరిగింది. నగరంలోని నోవాటెల్ హోటల్ వద్ద ఓ కారును దుండగులు దహనం చేశారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారులోని ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వివాదాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. కొన్నాళ్ల కిందట రియల్ ఎస్టేట్ వివాదాల కారణంగానే దొమ్మీ తరహాలో రెండు ముఠాలు భీకరంగా కలబడిన సంగతి తెలిసిందే.