Skip to main content

ప్లాస్మా దానానికి భయపడొద్దు: రాజమౌళి

 ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. పౌష్ఠికాహారం తీసుకుంటూ.. వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చన్నారు. 

కీరవాణి మాట్లాడుతూ.. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవినితో సమానమన్నారు. తమ కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.  సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ...కరోనా బాధితులపై వివక్ష చూపొద్దని, వారే రేపటి ప్రాణదాతలని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ లఘుచిత్రం, సంగీత దర్శకుడు కీరవాణి రూపొందించిన పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణిని సీపీ సజ్జనార్‌ సత్కరించారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here