అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎగురుకుంటూ వచ్చిన ఓ డ్రోన్ ఒకటి విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment