Skip to main content

నాన్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు:ఎస్పీ చరణ్‌


 ప్రముఖ గాయకుడు, తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెంటిలేటర్‌ తొలగించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. సోమవారం ఏవిధంగానైతే ఉందో నేడూ అలాగే ఉంది. నాన్నగారికి వెంటిలేటర్‌ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆ రోజు రావాలని మేమూ ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. ఇలాగే మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.