కరోనాతో తీవ్రపోరాటం సాగిస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. తన అన్నయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వెల్లడించారు. మునుపటితో పోల్చితే ఎంతో కోలుకున్నారని తెలిపారు. ఇవాళ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ తొలగించారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నారని వివరించారు. తన సోదరుడు చికిత్సకు స్పందిస్తున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తన సోదరుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనా చికిత్స కోసం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్నిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Post a Comment