Skip to main content

ఫేస్‌బుక్‌లోనూ టిక్‌టాక్‌ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్!

 సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కొత్తగా 'షార్ట్‌ వీడియో' అనే ఫీచర్‌ను‌ తీసుకురానుంది. షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించడంతో పాటు అమెరికాలోనూ నిషేధం విధించే అవకాశాలు ఉండడంతో ఫేస్‌బుక్‌ కూడా ఆ తరహా షార్ట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. 


న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ ఫీచర్ ఉంటుంది. ఇందులో చిన్న వీడియోలను యూజర్లు రూపొందించుకోవచ్చు. ఇందులో మనం పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్‌ వచ్చాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ అనే ఓ ఆప్షన్ తీసుకువచ్చి షార్ట్ వీడియోలను పోస్ట్ చేసుకునేలా సౌలభ్యం కలిగించిన విషయం తెలిసిందే.

షార్ట్ వీడియోలకు అత్యధిక ఆదరణ వస్తుండడంతో యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, షార్ట్ వీడియో యాప్‌లను తీసుకురావడానికి ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. షార్ట్ వీడియోలు యూజర్ల సమయాన్ని వృథా చేయకుండా, బోర్‌ కొట్టించకుండా ఉంటుండడంతో వీటికి బాగా ఆదరణ వస్తోంది.  

Comments