Skip to main content

ఉత్తర కొరియాలో తీవ్ర ఆహారకొరత... పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ కిమ్ ఆదేశాలు

 



ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన మార్కు నిర్ణయం ఎలావుంటుందో చాటిచెప్పారు. దేశంలో ఆహార కొరత తీవ్రమైన నేపథ్యంలో, ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రజలకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. జూలైలో ఆయన కొత్త విధానం ప్రకటించారు. ఎవరైనా గానీ పెంపుడు కుక్కను కలిగివుండడం జాతీయ చట్టానికి వ్యతిరేకం అని హుకుం జారీ చేశారు. అంతేకాదు, పెంపుడు కుక్కను కలిగివుండడం కళంకిత బూర్జువా విధానానికి ప్రతీక అని కిమ్ సూత్రీకరించారు.

కిమ్ ఆదేశాలు ఇచ్చిందే తరువాయి, అధికారులు పెంపుడు కుక్కలు ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ శునకాలను ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. కొరియాలో కుక్కమాంసం తినడం ఎప్పట్నించో ఉంది. అయితే, కుక్కమాంసం తినే అలవాటు దక్షిణ కొరియాలో క్రమంగా తగ్గిపోతుండగా, కిమ్ మాత్రం ఆహార కొరత నేపథ్యంలో పెంపుడు కుక్కలపై పడ్డారని అతడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.