Skip to main content

మీ పాలసీ ల్యాప్స్ అయిందా? LIC గుడ్‌న్యూస్, రాయితీతో పునరుద్ధరణ నేటి నుండే

ఏదైనాకారణంతో మీ ఇన్సురెన్స్ పాలసీ రద్దయిందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఏ కారణంతో అయినా ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రకటించింది. ఈ రోజు (ఆగస్ట్ 10, సోమవారం) నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

1ఈ పాలసీలు మినహా... లేట్ ఫీజుపై రాయితీ

టర్మ్ పాలసీలు, ఇతర అధఇక నష్టభయం పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో పునరుద్ధరించుకోవచ్చునని ఎల్ఐసీ తెలిపింది. ఆలస్య రుసుంపై 20 శాతం మినహాయింపు ఉందని, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 25 శాతం రాయితీ కూడా ఉంటుందని మరో అదనపు ఊరట కల్పించింది. ఈ పాలసీల పునరుద్దరణ కోసం ఎల్ఐసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది.

2అయిదేళ్లలోపు ఉంటే పునరుద్ధరణ

ఏ పథకానికి కూడా వైద్యపరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే లేట్ ఫీజు మాత్రం చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించలేని తేదీ నుండి అయిదేళ్లలోపు అయితే పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీ కాలవ్యవధి ముగియని వాటినే పునరుద్ధరించుకునే వీలు ఉందని తెలిపింది.

3ఇది మంచి అవకాశం

కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అయిదేళ్ల నుండి తీసుకున్న నిర్ధిష్ట అర్హత కలిగిన పాలసీలను చెల్లించని మొదటి ప్రీమియం నుండి పునరుద్ధరించుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పాలసీదారులు తమ ఇన్సురెన్స్ పాలసీని కొనసాగించాలని కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

Comments