Skip to main content

తెలుగు వారిని అవమానిస్తే ఊరుకోం: చలసాని శ్రీనివాస్


విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ బీజేపీపై స్పందించారు. బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తోందని అన్నారు. తెలుగువారిని అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధులు కేటాయించాలని, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ తేవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. అటు సీఎం జగన్ పైనా చలసాని వ్యాఖ్యలు చేశారు.

కొత్త ప్రభుత్వంపై బాధ్యత ఉందని జగన్ మర్చిపోతున్నారని, రాష్ట్ర ప్రజల తరఫున విభజన హామీలపై కేంద్రం మీద జగన్ ఒత్తిడి తేవాలని సూచించారు. అంతేగాకుండా, రాష్ట్ర సర్కారు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. విభజన హామీల కోసం మరోసారి ఉద్యమాలు నిర్వహిస్తామని, ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపడతామని, ముందుగా వచ్చే నెలలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయమై జనవరి నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిపారు

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here