Skip to main content

మమ్మల్ని అపారమైన అభిమానంతో దీవించారు: మహారాష్ట్ర, హర్యానా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

 

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మహారాష్ట్ర, హర్యానా ప్రజలు తమను అపారమైన అభిమానంతో దీవించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ట్వీట్ చేశారు. మరోసారి ప్రజల మద్దతు పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఎన్నికల కోసం అహర్నిశలు శ్రమించిన బీజేపీ, శివసేనకు ప్రతి కార్యకర్తకు, యావత్ ఎన్డీయే కుటుంబానికి అభివందనం అంటూ పేర్కొన్నారు. హర్యానాలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ అభివృద్ధి అజెండాను వివరించిన బీజేపీ కార్యకర్తల కృషి శ్లాఘనీయం అని కొనియాడారు. కాగా, ఎన్నికల ఫలితాల్లో హర్యానాలో బీజేపీ మొత్తం 90 సీట్లకు గాను 40 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను 157 స్థానాల్లో నెగ్గి మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది

Comments