మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యాణా
ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46
స్థానాలను కూడా గెలవలేని స్థితిలో బీజేపీ ఉంది. ఇతరులను కలుపుకుంటే తప్ప
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో,
ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి
రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
అమిత్ షాకు పంపించారు. మరోవైపు, ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతుండటంతో...
జేజేపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. 10 స్థానాల్లో ఈ
పార్టీ ఆధిక్యంలో ఉంది.
Comments
Post a Comment