Skip to main content

హుజూర్ నగర్ ఎన్నిక కౌంటింగ్... ఆధిక్యంలో సైదిరెడ్డి!

 
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.
 తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సైదిరెడ్డి 17,476 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

 గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి విజయం సాధించిన ఉత్తమ్, ఆపై నల్గొండ లోక్ సభకు పోటీ చేసి గెలుపొందడంతో, హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. కాగా, మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ సాగనుండగా, మధ్యాహ్నం ఒంటిగంట లోపే తుది ఫలితం వెలువడుతుందని అధికారులు అంటున్నారు.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.