హరియాణా కేబినెట్‌లో సీఎంతో కలిపి 9 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, అనిల్ విజ్ మినహా మిగతా ఏడుగురు మంత్రులు విజయతీరాలను చేరుకోలేకపోయారు. ఇప్పటికే మంత్రులు కెప్టెన్ అభిమన్యు, రామ్ విలాస్ శర్మ ఓడిపోగా.. మిగతా వారూ వెనుకంజలో ఉన్నారు. సహాయ మంత్రి కృష్ణ కుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా కూడా ఓటమి చవిచూశారు.
హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు అవసరం. అయితే ప్రస్తుతం ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌కు మెజార్టీ రాకపోవడంతో దుశ్యంత్ చౌటాలా నేతృత్వంలోని జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. జేజేపీ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Comments
Post a Comment