Skip to main content

మహేష్ ఫ్యామిలీ యాడ్ చూసారా?



చూడ ముచ్చటగా ఉన్న మహేష్ బాబు కుటుంబం సందేశాత్మక చిత్రాలతో వరుస హిట్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు. అయితే కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలోనూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తాడు. అంతేకాదు అందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులను ఆకట్టుకుంటాడు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్‌… ప్రచార ప్రకటనల్లోనూ అగ్ర స్థానంలోనే ఉన్నాడు. వరుస కమర్షియల్‌ యాడ్స్‌తో దూసుకుపోతున్నాడు. మహేష్‌బాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ అలాంటిది మరి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏకంగా సూపర్‌స్టార్‌ ఫ్యామిలితో ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో మహేష్‌తో పాటు అతడి భార్య నమ్రతా శిరోద్కర్‌, పిల్లలు గౌతం, సితారలు కూడా నటించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్న మహేష్‌… తమ కుటుంబమంతా కలిసి నటించడం ఇదే తొలిసారి అని.. ఇదో గొప్ప విశేషం అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ అభిమానులు.. ‘ అందరూ ఒకే ఫ్రేమ్‌లో కన్నుల పండుగగా ఉంది. మిమ్మల్ని ఇలా చూడాలనుకున్న కల నేటికి నెరవేరింది. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు తన సొంత దుస్తుల బ్రాండ్‌ కూడా ఓపెన్‌ చేసి పక్కా బిజినెస్‌మ్యాన్‌ అనిపించుకున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...