ప్రచారంలో పదునైన విమర్శలు
ప్రచారానికి తక్కువ సమయం లభించడంతో కాంగ్రెస్-తెరాసలు వాడివేడి విమర్శలు చేసుకొన్నారు. హస్తం పార్టీ నుంచి ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. తెరాస ప్రభుత్వ పాలనలోని లోటు పాట్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయానికి ఆర్టీసీ సమ్మె కూడా మొదలుకావడంతో దానినే ప్రధానాంశంగా చేసుకున్నారు.
మరోవైపు తెరాస కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ లేకపోయినా ఆ లోటు తీర్చేలా తెరాస నాయకులు ప్రచార సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. కేటీఆరే స్వయంగా ఇక్కడ ప్రచారాన్ని పర్యవేక్షించారు.
‘చే’జిక్కుతుందని భావించినా...
కాంగ్రెస్‌కు కంచుకోటైన హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ పై పెద్దగా అసంతృప్తి బయటపడలేదు. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం హుజూర్ నగరి ‘హస్త’గతమని భావించారు. సమయానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా జరగడంతో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కాంగ్రెస్‌కు సానుకూలాంశంగా మారుతుందని భావించారు. కానీ, ఆ విషయాన్ని సొమ్ము చేసుకోవడంలో హస్తం పార్టీ నేతలు విఫలమయ్యారు.
ఓడిన చోటే గెలవాలని
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే మాటను తెరాస బలంగా పాటించింది. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పోటీ చేస్తున్నా విజయం మాత్రం వారిని వరించలేదు. ఇప్పుడు అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెరాస సంకల్పించింది. ఉపఎన్నికల్లో గెలుపు సాధించడం అలవాటుగా మార్చుకున్న ఆ పార్టీ.. ఈ సారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గం మనుగడలోకి వచ్చింది. అప్పటి నుంచి 2009, 2014, 2018 సంవత్సరాల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైదిరెడ్డి 7,466 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
పూర్తికాగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై ఆయన 40,447 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే ఆయన విజయం లాంఛన ప్రాయంగా మారింది.
ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన తెదేపా, భాజపా
తెలంగాణలో అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేసిన భాజపా..కనీసం డిపాజిట్లు కూడా దక్కించులేకపోయింది. మరోవైపు అనుకోకుండా బరిలోకి దిగిన తెలుగు దేశం పార్టీది కూడా అదే దారి.
తెరాస సానుకూలాంశాలివి..
* గతంతో పోలిస్తే ఓటు బ్యాంకు పెరగడం.
* ఉప ఎన్నికల్లో తెరాస గెలుపు సంప్రదాయం.
* ప్రతి 60 మంది ఓటర్లకు ఒక కార్యకర్త చొప్పున నియమించి అభిమానాన్ని ఓట్లుగా మలుచుకొని బూత్ వరకు తీసుకురావడంలో సఫలం కావడం.
* మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, పార్టీ కార్యదర్శలు ఇలా అన్ని స్థాయిల్లోనూ 70 మంది నాయకులను అన్ని మండలాల్లోనూ మోహరించారు. ఇక్కడ గెలుపు కోసం ఓ ఇన్‌ఛార్జిని కూడా నియమించింది.
* తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం.
* అన్నింటికి మించి పోల్ మేనేజ్‌మెంట్‌లో తెరాస నూటికి నూరు శాతం సఫలమైంది.
హుజూర్‌నగర్ ఫలితం: రౌండ్‌ల వారీగా..
హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు కొనసాగింది. రౌండ్ల వారీగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. 22వ రౌండ్ పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,233 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్ నుంచి తెరాస పూర్తిస్థాయిలో ఆధిపత్యం కొనసాగించింది. హుజూర్‌నగర్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ఆయా రౌండ్లలో సాధించిన ఓట్ల సరళిని పరిశీలిస్తే..
రౌండ్ | తెరాస | కాంగ్రెస్ | భాజపా | తెదేపా |
1. | 5583 | 3107 | 128 | 113 |
2. | 4723 | 2851 | 170 | 69 |
3. | 5089 | 2540 | 114 | 86 |
4. | 5144 | 3961 | 102 | 127 |
5. | 5041 | 3032 | 105 | 57 |
6. | 5308 | 3478 | 72 | 49 |
7. | 4900 | 3796 | 45 | 46 |
8. | 5624 | 4055 | 57 | 46 |
9. | 5039 | 3186 | 111 | 69 |
10. | 4328 | 2190 | 122 | 69 |
11. | 5877 | 3169 | 77 | 196 |
12. | 4789 | 2586 | 103 | 70 |
13 | 5116 | 3578 | 84 | 51 |
14 | 5224 | 3237 | 98 | 94 |
15 | 6118 | 3504 | 135 | 128 |
16 | 6100 | 3751 | 163 | 101 |
17 | 5456 | 3206 | 93 | 69 |
18 | 4643 | 2972 | 127 | 73 |
19 | 5443 | 3044 | 341 | 82 |
20 | 5109 | 2964 | 199 | 77 |
21 | 5118 | 3080 | 119 | 87 |
22 |
Comments
Post a Comment