Skip to main content

సీపెట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి: కేంద్ర మంత్రి సదానంద గౌడ





ప్లాస్టిక్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ గా దృష్టి సారించారని, ప్లాస్టిక్ నిర్మూలనకు కూడా పిలుపునిచ్చారని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం మండలం, సూరంపల్లిలో సీపెట్ భవన సముదాయాన్ని సీఎం జగన్ తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగివున్న దేశం భారత్ అని ఆయన పేర్కొన్నారు.

‘ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైంది. దాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా కాపాడవచ్చు. ప్రధాని మోదీ ప్లాస్టిక్ నిర్మూలనకు పిలుపునిచ్చారు. సీపెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసేందుకు కృషిచేస్తుంది. విజయవాడలో పరిశ్రమలు నెలకొల్పడానికి మంచి అవకాశాలున్నాయి, దీనిపై నేను సీఎం జగన్ తో చర్చిస్తా. కొత్త రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మరో సీపెట్ సంస్థ ఏర్పాటు చేస్తాం’ అని సదానంద గౌడ చెప్పారు.   

Comments