Skip to main content

మహారాష్ట్ర, హరియాణాలో కమలం జోరు

మహారాష్ట్ర, హరియాణాలో కమలం జోరు
 మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో 142 చోట్ల భాజపా ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 87, ఇతరులు 30 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక హరియాణాలో భాజపా 40 చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్‌ 23, జననాయక్‌ జనతా పార్టీ 11, ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 
హరియాణాలోని కైతాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా వెనుకంజలో ఉన్నారు. హరియాణా దాద్రి నుంచి పోటీ చేస్తున్న రెజ్లర్‌ బబితా ఫొగట్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన యువ నేత ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు.

Comments