Skip to main content

చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?

 
చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?
 దుశ్యంత్‌ చౌటాలా ఎవరు?.. మాజీ ఉపప్రధాని చౌదరీ దేవీలాల్‌ మునిమనవడు.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా మనవడు.. మాజీ ఎంపీ.. ఇప్పటివరకు తెలిసిందిదే.. కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనో కింగ్‌ మేకర్‌..! ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పే కీలక నాయకుడు.. ‘చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ’ అంటూ ప్రధాన పార్టీలు ఆత్రుతగా వెతుకుతున్న సరికొత్త ‘హంగ్‌ కింగ్‌’.
రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితం హంగ్‌ దిశగా సాగుతోంది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నా.. రెండు పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం దక్కే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో ఇరు పార్టీల చూపు  చౌటాలా నాయకత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)పై పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం భాజపా, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఆయన మద్దతు కోరుతున్నాయి.
రంగంలోకి కేంద్ర నేతలు..
ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తారుమారవడంతో భాజపా, కాంగ్రెస్‌ కేంద్ర నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫలితాలు సంక్లిష్టంగా ఉండటంతో  భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను దిల్లీకి పిలిచారు. మరోవైపు భాజపా తన మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ పెద్దలను జేజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు పంపింది. 
అటు కాంగ్రెస్‌ కూడా వ్యూహాలు రచిస్తోంది. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌నేత, మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హుడాతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.
దుశ్యంత్‌కు సీఎం పదవి..?
కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసి చౌటాలాకు సీఎం పదవి ఇస్తామని ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది. గతంలో కర్ణాటక మాదిరిగా హరియాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం పదవి ఎవరిస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని అంతకుముందు చెప్పిన దుశ్యంత్‌.. ఇప్పుడు మాత్రం తుది ఫలితం వచ్చాకే తన నిర్ణయం వెల్లడిస్తానని అంటున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాలో భాజపా మరోసారి గద్దెనెక్కాలన్నా లేదా హస్తం పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నా.. అది ‘ఛోటా చౌటాలా’పైనే ఆధారపడి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...