Skip to main content

రివర్స్’తో ఇప్పటివరకూ రూ.1000 కోట్ల ఆదా చేశాం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్


రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ విధానంలో సక్సెస్ అవుతున్నామని చెప్పారు. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనులు రూ.540 కోట్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని, దీంతో ప్రభుత్వానికి రూ.61 కోట్లకు పైగా ఆదా అయిందని చెప్పారు. ఇంకా నెల రోజుల్లో ఇరిగేషన్ శాఖ ద్వారా పదిహేను వందల కోట్లు ఆదా చేయబోతున్నట్టు చెప్పారు.

ఈ విధానంతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తే దాన్ని దోపిడీ అంటారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ విధానంపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఆదా చేస్తుంటే హర్షించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదు అని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.
ఏపీలో కొన్ని నెలలుగా నెలకొన్న ఇసుక కొరతపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదులకు వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత త్వరలోనే తీరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాల నుంచే మనకు ఇసుక వస్తోందని అన్నారు.

వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని, ‘ఆ భగవంతుడే వీళ్లను కాపాడాలి’ అని పేర్కొన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని విమర్శించారు. మొన్నటి వరకూ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన బాబు ఇప్పుడు యూ-టర్న్ తీసుకునేందుకు చూస్తున్నారని విమర్శించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.