కంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆర్టీసీ
కార్మికుల సమ్మెలో భాగంగా నేడు ఆర్టీసీ జేఏసీ, కాంగ్రెస్ పార్టీ ప్రగతి
భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో, కీలక నేతలను పోలీసులు
ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి
కోసం గాలిస్తున్న పోలీసులకు ఆయన ఆచూకీ లభించలేదు. ఇంటి వద్ద ఆయన
కనిపించలేదు, నిన్న రాత్రి నుంచి ఇంట్లో రేవంత్ లేరు. దీంతో, రేవంత్ కోసం
ఆయన అనుచరుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ప్రగతి
భవన్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రగతి
భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
Comments
Post a Comment