రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి అష్టకష్టాలు పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నవంబరు 3, లేదా నవంబరు 4న వైజాగ్ లో లాంగ్ మార్చ్ పేరిట భారీ ర్యాలీ చేపట్టనుంది. నిన్న జరిగిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీని జనసేనాని పవన్ కల్యాణ్ ముందుండి నడిపించనున్నారు.
అయితే, ర్యాలీ విధి విధానాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్వహించాలి అనే అంశాలు నిర్ధారించేందుకు పార్టీ అగ్రనేతలు లాంగ్ మార్చ్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటి ముఖ్యనేతలు నేతృత్వం వహించారు.
Comments
Post a Comment