Skip to main content

గోదావరిలో బోటు వెలికితీతలో పురోగతి.. బోటు పైకప్పును బయటకు తీసిన ధర్మాడి సత్యం బృందం

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీయడంతో ధర్మాడి సత్యం బృందం కొంత పురోగతి సాధించింది. ఈ క్రమంలో బోటు పైకప్పును, బయటకు తీశారు. రెండు రోప్ లను బోటుకు కట్టి, మిగతా బోటును బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

ఇక మరి కాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీస్తారని భావిస్తున్నారు. మరోవైపు, గోదావరి నీటిమట్టం 38 నుంచి 40 అడుగుల మేర మాత్రమే ఉండటంతో... బోటును వెలికి తీసుకొచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ కు చెందిన డైవర్లు ఈ ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రాంతానికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు బోటు పరిస్థితి ఎలా ఉంది? ఇసుక ఎంత మేర పేరుకుపోయింది తదితర అంశాలను పరిశీలించారు. ఇలా 6 సార్లు నీటి లోపలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు అధికారి మాట్లాడుతూ, బోటు ఏటవాలుగా మునిగి ఉందని చెప్పారు.

Comments

Popular posts from this blog

ఆసుపత్రిలో చేరిన శివసేన నేత సంజయ్ రౌత్

  శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

నా 50ఏళ్ల రాజకీయంలో ఇలాంటివెన్నో చూశా!

శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీల కూటమే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కరాడ్‌లో మీడియాతో మాట్లాడారు. భాజపాతో చేతులు కలిపింది తన సోదరుడి కుమారుడు అజిత్‌ పవారే తప్ప ఎన్సీపీ కాదని పునరుద్ఘాటించారు. ఇది ఎంతమాత్రం  తమ పార్టీ నిర్ణయం కాదనీ..  ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని తాము అంగీకరించబోమని పవార్‌ స్పష్టంచేశారు. ఎన్సీపీ- కాంగ్రెస్‌- శివసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తమ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌తో తాను టచ్‌లో లేనన్నారు. అజిత్‌ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించే అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం అనూహ్యంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్ర...