హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కేటీఆర్
మరోమారు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం కేటీఆర్ ఓ ట్వీట్
చేశారు. తమ నాయకుల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ మేరకు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్
అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీతో గెలవబోతున్నారన్న
నమ్ముతున్నానని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల నిమిత్తం గత నెల రోజులుగా
ఎంతగానో శ్రమించిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తన కృతఙ్ఞతలు
తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment