హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రగతి భవన్ కు బైక్ పై దూసుకొచ్చిన రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ప్రాంతాలకు తిప్పారు. ప్రగతి భవన్ నుంచి గోల్కొండ ప్రాంతంలో ఉన్న గోల్ఫ్ కోర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని మరో వాహనంలోకి మార్చారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డు, పుప్పాల గూడ, నార్సింగ్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడినుంచి చివరిగా కామాటిపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు.
శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment