ఇప్పటికే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది. సాధారణ స్థాయి
కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ
చేసింది. హైదరాబాదులో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని
హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు
కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్ల నిన్న నగరంలో 40 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్
లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
హెచ్చరించింది.
శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment