బ్రాండ్ అంటే..? ఆ పేరులో ఒక గుర్తింపు ఉంటుంది. ఆ పేరుకి ఒక గౌరవం ఉంటుంది. ఆ పేరుకి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న కంపనీనే మేఘా ఇంజినీరింగ్. ప్రస్తుతం దేశంలో భారీ ప్రాజెక్ట్స్ అన్నిటికి ఈ సంస్థే కేరాఫ్. అలాంటి మేఘా చుట్టూ ఇప్పుడు వివాదాలు. అయితే అవి రాజకీయ వివాదాలు.
సంస్థ పేరుని దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు, ప్రత్యర్దులు సృష్టిస్తున్న వివాదాలు.అందుకే ఇప్పుడు అసలు మేఘా చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందాం. దేశంలో అన్లిస్టెడ్ కంపెనీల్లో మొదటిస్థానానికి చేరుకుని ఎన్నో వేల కుటుంబాకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశం ప్రగతిలో తాము సైతం అని ముందుకు వెళుతున్న మేఘా వెనుక ఉన్న ఏకైక శక్తి ఆ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి.
ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యం కోసం ఈ సంస్థను నడపడం లేదు. యాజమాన్యం కోసం ఈ కంపెనీ పనులు చేయాల్సిన పరిస్థితులు లేవు. యాజమాన్యం ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉంది. ఇప్పుడు కంపెనీ నడుస్తున్నదల్లా అందులో పనిచేస్తున్న 15 00 వేలకుపైగా ఉద్యోగులు, పరోక్షంగా దాదాపు 2 లక్షల మంది కి రోజూ పనికల్పించడంకోసం.
ఇక ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఏటా వేలకోట్ల రూపాయలు సమకూరుస్తోంది. అదే సమయంలో దేశం అభివృద్ధి సాధించడం కోసం అవసరమైన మౌళిక వసతులు మరీ ముఖ్యంగా క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులను శాశ్వతంగా సమకూరుస్తోంది. జాతీయ అభివృద్ధిలో మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన దేశ ప్రగతిలో మేఘా తన బాధ్యతను నిర్వహిస్తోంది. ఈ సంస్థ వల్ల యాజమాన్యం కన్నా ప్రభుత్వానికి, సమాజానికే ఎక్కువ ప్రయోజనం ఉందనడంలో అతిశయోక్తి లేదు.
రాయలసీమకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు క్లిష్టమైన హంద్రీ-నీవా నిర్మించినా, తెలంగాణలో ఎత్తులో ఉన్న బీడు భూములకు నీరు అందించడానికి ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం పూర్తి చేస్తోన్నా, పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాను కరువు సమయంలో ఆదుకోవడమే కాకుండా దేశంలో ఐదు నదులను అనుసంధానం చేసిన ఘనత మేఘాదే.
1989లో చిన్న సంస్థగా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రస్థానం అనంతరకాంలో ఇరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో ఒక దిగ్గజంగా ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పీపీరెడ్డి 1989లో సిమెంట్ పైపులు తయారు చేసే సంస్థగా ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో పీవీ కృష్ణారెడ్డి భాగస్వామ్యంతో ఎంఇఐఎల్ రూపురేఖలే మారిపోయాయి. ఆయన వ్యాపారాన్ని మౌళిక వసతుల రంగంలోకి మలిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు నెకొల్పింది.
మనదేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి వున్నాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో కూడా తమ సత్తా చూపింది మేఘా.
నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తిచేయటంలో మేఘా ఇంజనీరింగ్ కి సాటి దేశంలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కేవం టీమ్ వర్క్ వల్లనే అది సాధ్యం అయింది అంటున్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి. సంస్థలోని ప్రతి ఇంజినీరు, కార్మికుడు కూడా తన సొంత ఇల్లు ఎంత జాగ్రత్తగా కట్టుకుంటారో, అంతే శ్రద్ధ ప్రాజెక్ట్ అమలులో చూపిస్తారని ఆయనే స్వయంగా చెబుతారు. అందువల్లనే నిర్దేశిత సమయంలో పూర్తిచేయటం ఒక్కటే కాదు, నాణ్యతలో ఎక్కడ రాజీ పడమంటారు ఆయన.
వ్యాపారాలు మాత్రమే సంస్థ లక్ష్యం కాకుండా ప్రజాజీవనానికి తమవంతు పాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ఎన్నో మంచినీటి ప్రాజెక్టులు నిర్మించింది మేఘా ఇంజనీరింగ్. హైద్రాబాదులోని అతిపెద్ద వాటర్ గ్రిడ్ కూడా మేఘ ఇంజనీరింగ్ నిర్మించిందే. ప్రజలకు సమయానికి కావలసినంత తాగునీరు అందించాలన్న ప్రభుత్వాల స్వప్నాలకు వాస్తవ రూపానిస్తోంది మేఘా.
కార్పొరేట్ సామజిక బాధ్యత కింద ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించటం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కొన్ని గ్రామాల్లో రహదారులు ఏర్పాటు వంటి కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేసింది. అంతేకాక ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు, వారి బంధువులకు మధ్యానా భోజనము ఉచితంగా అందిస్తోంది.
కేన్సర్ బాధిత చిన్నారుల ఆసుపత్రి నిలోఫర్లో కూడా పిల్లలకు ఉచితంగా ఆహారం, ఇతర ఉపకరణాలు అందజేస్తోంది. తన స్వంత ఖర్చుతో నిమ్స్ లో కూడా కేన్సర్ బాధితులకు అతిపెద్ద భవనాన్ని సకల సదుపాయాలతో నిర్మించి ఇచ్చింది. ఇది మేఘా చరిత్ర. ఇలాంటి మేఘా సంస్థ పై రాజకీయ కక్షలతో నిందలు వేయడం ఎంత వరకు కరెక్ట్
Comments
Post a Comment