Skip to main content

ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే హవా!

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొంచెం సేపటి క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందన్న విషయమై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాగా ఉంది. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరంగా భంగపడనుంది.

టైమ్స్ నౌ (మహారాష్ట్ర)..  బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

టైమ్స్ నౌ (హర్యానా).. బీజేపీకి 71 స్థానాలు, కాంగ్రెస్ కు 11 స్థానాలు

ఇండియా టుడే (మహారాష్ట్ర) .. బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు, శివసేనకు 57 నుంచి 70, కాంగ్రెస్ కు 32 నుంచి 40, ఎన్సీపీ 40 నుంచి 50, ఇతరులకు 22 నుంచి 30 స్థానాలు

రిపబ్లిక్ (మహారాష్ట్ర).. బీజేపీకి 135 నుంచి 142 స్థానాలు, శివసేనకు 81నుంచి 88 స్థానాలు, కాంగ్రెస్ కు 20 నుంచి 24 స్థానాలు, ఎన్సీపీకి 30 నుంచి 35 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు

రిపబ్లిక్ (హర్యానా).. బీజేపీకి  52 నుంచి 63 స్థానాలు, కాంగ్రెస్ కు 15 నుంచి 19 స్థానాలు, జేజేపీ కి 5 నుంచి 9 స్థానాలు, ఐఎన్ఎల్ డీ 0 నుంచి 1 స్థానం, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు

న్యూస్ ఎక్స్ (హర్యానా).. 
బీజేపీకి 75 నుంచి 80 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు

సీఎన్ఎన్ న్యూస్ 18 (మహారాష్ట్ర).. 
బీజేపీకి 243 స్థానాలు, కాంగ్రెస్ కు 41 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు

ఏబీపీ న్యూస్ సి.ఓటర్ (మహారాష్ట్ర).. 
బీజేపీకి 204 స్థానాలు, కాంగ్రెస్ కు 69 స్థానాలు, ఇతరులకు 15 స్థానాలు

న్యూస్ 24 (మహారాష్ట్ర).. బీజేపీకి 230 స్థానాలు, కాంగ్రెస్ కు 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

Comments

Popular posts from this blog

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

  రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి...