ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు
కురుస్తున్నాయి. ఈ నెల 23న బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర మీదుగా
అల్పపీడనం ఏర్పడవచ్చని, తద్వారా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
కురుస్తాయని తాజా వాతావరణ హెచ్చరికలు చెబుతున్నాయి. నెల్లూరు, గుంటూరు,
కృష్ణా, ఉభయగోదావరి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం,
చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో
తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు రౌత్ సోదరుడు సునీల్ తెలిపారు. తన సోదరుడు రేపు డిశ్చార్జ్ అవుతాడని సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రౌత్ ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment