తాను ఏ తప్పు చేయలేదని... అందుకే ఎవరికీ భయపడనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ తండ్రి తనపై 26 కేసులు వేశారని... అయినా సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరిచిపోనని... కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుగా పెడతానని చెప్పారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రజల ఆశీస్సులు పొందాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
ఇకపై పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులను కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని... కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని అన్నారు. జగన్ సర్కారు శాశ్వతం కాదనే నిజాన్ని పోలీసులు గ్రహించాలని చెప్పారు. మైనింగ్ గనులను ఇచ్చిన వ్యక్తి జగన్ సలహాదారుడిగా ఉన్నారని విమర్శించారు.
Comments
Post a Comment