స్పష్టత ఇచ్చిన జీవితా-రాజశేఖర్
‘‘ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి సమావేశం జరిగింది. దీని గురించి మీడియాలో, వాట్సాప్‌లలో పలు రకాల వార్తలు వచ్చాయి. ఆ సమావేశం జరగలేదని, కోర్టుకు వెళ్లారని, మధ్యలోనే ఆగిపోయిందని, కోర్టును ధిక్కరించి మీటింగ్ పెట్టారని, పెద్ద గొడవ జరిగిందని రకరకాల వార్తలు విన్నా. సమస్యల పరిష్కారంపై నిన్నటి ‘మా’ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మేం దీనిపై అధికారికంగా మాట్లాడకపోవడం వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకొన్నారు. అలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయానికి వచ్చా. అసలేం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. ఆదివారం సమావేశం నిర్వహించాలనే దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా దాదాపు 200మంది ‘మా’ సభ్యులు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. వారి అందరి అభిప్రాయాలనే నేను మీకు చెబుతున్నా. కొందరు ఈ సమావేశానికి రాలేకపోయారు. వాళ్ల కోసం వివరాలు చెబుతున్నా’’
Comments
Post a Comment