Skip to main content

రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాయాలి రాహుల్ జీ!: రాజ్ నాథ్





 రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాసిన విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. హర్యానాలోని భవానీలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... విజయ దశమి రోజున ఆయుధ పూజలు చేయడం మన సంప్రదాయమని అన్నారు. తాను రాఫెల్‌ యుద్ధ విమానంపై ఓం రాశానని, అయితే, అలా ఎందుకు రాశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 'నేను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ రోజు శస్త్ర పూజలో రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాసి ఉండాల్సింది?' అని ప్రశ్నించారు.

ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్.. తొలి రాఫెల్ విమానాన్ని అందుకుని, దానికి శస్త్ర పూజలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. ఇటీవల 'డ్రామా' అంటూ విమర్శించారు. 'ఇటువంటి మూఢనమ్మకాలు తొలగిపోయినప్పుడే భారత్ సొంతంగా రాఫెల్ వంటి యుద్ధ విమానాలను తయారు చేసుకోగలదు' అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. కాగా, హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు ఈ నెల 24న వెల్లడవుతాయి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.