Skip to main content

జేడీయూతో విభేదాలు లేవు: అమిత్‌ షా




బీహార్ లోని తమ బీజేపీ-జేడీయూ కూట‌మిలో విభేదాలు ఉన్నాయ‌ంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యకుడు అమిత్ షా కొట్టిపారేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసే పోటీ చేస్తాయని ఆయన స్పష్టతనిచ్చారు. అలాగే, ఆ ఎన్నికల్లో తమ కూటమి నాయకత్వ బాధ్యతలను ముఖ్యమంత్రి నితీశ్ కుమారే చేప‌డతార‌ని తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల అనంతరం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.
 
కొంతకాలంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మిత్రపక్షం బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఈ ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందేహాలకు అమిత్ షా తెరదించారు.

Comments