Skip to main content

సరిహద్దులో పాకిస్థానీ చొరబాటుదారుడి హతం




భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులో భారత్‌ బగాలు నిన్న ఓ చొరబాటుదారుడిని కాల్చిచంపాయి. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని నిలువరించేందుకు సరిహద్దు బలగాలు చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే...నిన్న సాయంత్రం భద్రతా బలగాలు చెక్‌పోస్టు వద్ద కాపలా కాస్తుండగా గేట్‌ నంబర్‌ 103 ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు అతన్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయినా అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే చనిపోగా, అతని వద్ద భించిన బ్యాగులో జత దుస్తులు, సిమ్‌ కార్డు, మెమరీ కార్డు లభించాయి.

చనిపోయిన వ్యక్తిని గుల్నవాజ్‌గా జవాన్లు గుర్తించారు. ఘటనపై సరిహద్దులోని పాకిస్థాన్‌ జవాన్లకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. అయితే చొరబాటు దారుడిని కాల్చి చంపిన నేపథ్యంలో సరిహద్దులో హై అలర్ట్‌ ప్రకటించారు. అట్టారి రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.